Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంఘీక,గిరిజన, బలహీన వర్గాల, సాధారణ గురుకులాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఐదో తరగతి ప్రవేశాలకోసం పరీక్షను(వీటీజీసెట్-2023)ను ఆదివారం సంక్షేమ గురుకుల విద్యా సంస్థ నిర్వహించింది. ఈ పరీక్ష విజయవంతంగా జరిగిందని ఆ సంస్థల కార్యదర్శి రొనాల్డ్‌రోస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 638 సంక్షేమ గురుకులాల్లోని 51,524 ఐదో తరగతి ప్రవేశాల కోసం 1,21,826 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పరీక్షకు 1,13,211(92.93 శాతం) మంది విద్యార్థులు హాజరైనట్టు పేర్కొన్నారు.