Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉస్మానియా యూనివర్సిటీలో పెంచిన పీహెచ్డీ ఫీజులను తగ్గిం చాలని పోరాటం చేస్తున్న ఓయూ ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి నెల్లిసత్యపై వీసీ చేసిన అసత్య ఆరోపణలను తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తున్నది. పెంచిన ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తదని అబద్దాలు చెబుతున్న వీసీ వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్టలక్ష్మణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వమే చెల్లిస్తే విద్యార్థుల నుంచి ముందస్తుగా ఫీజును ఎందుకు వసూలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.