Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సర్వ జీవకోటికి ప్రాణాధారమైన పవిత్ర గంగను దివి నుంచి భువికి తీసుకొచ్చిన అపర భగీరథుని జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా జరుపనుందని పర్యాటక, సాంస్కతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న భగీరథ మహర్షి జయంతి వేడుకల సందర్భంగా రూపొందించిన వాల్ పోస్టర్‌ను పర్యాటక, సాంస్కతికశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మహనీయుల జయంతులను ఘనంగా జరిపిన చరిత్ర కేవలం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కుల వత్తుల మీద ఆధారపడ్డ జాతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వానికి బీసీలు రుణపడి ఉంటారని అన్నారు. భవిష్యత్తులో బీసీ వర్గాలను మరింతగా ఎదిగించేందుకు అన్ని రంగాలలో ప్రభుత్వం చేయూతనందిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరిశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ సగర సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం, జాతీయ నాయకులు వెంకట్రావు, ఉదరు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రవి. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కష్ణ, గ్రేటర్ హైదరాబాద్ యువజన సంఘం అధ్యక్షులు సీతారాం, సంఘం నాయకులు ఆంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.