Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈటలకు కాంగ్రెస్ నేతల హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ రూ. 25 కోట్లు ఇచ్చిందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలను టీపీసీసీ నాయకులు ఖండించారు. ఇలాంటి పిచ్చి మాటలు మానుకోవాలని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ సీనియర్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, ఈరవత్రి అనిల్, అద్దంకి దయాకర్, భూపతిరెడ్డి నర్సారెడ్డి, రోహిన్ రెడ్డి, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, ఫ˜హీం ఖురేషి తదితరులు విలేకర్లతో మాట్లాడారు. బాగ్యలక్మి దేవాలయంలో ప్రమాణం చేద్దాం...రావాలంటూ రేవంత్ విసిరిన సవాల్‌కు రాకుండా ఈటల పారిపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే విభజించి పాలించే పార్టీ అని విమర్శించారు. బీఆర్ఎస్ ఆయన్ను బయటకు పంపినప్పుడు పేదల పక్షాన పోరాటం చేశావని కాంగ్రెస్ సానుభూతి తెలిపిందని గుర్తు చేశారు. కానీ బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేననీ, బీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలను బయటపెడతామని హెచ్చరించారు.