Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సామాజిక చైతన్యం, సమ సమాజ స్థాపన లక్ష్యంతో భారతీయ దార్శనికుడు బసవేశ్వరుని ఆశయాల సాధనకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. ఆయనో ఆధ్యాత్మిక విప్లవకారుడు అనీ, వర్ణ, లింగ వివక్షలేని సమాజం కోసం 900 ఏండ్ల క్రితమే పోరాడారని గుర్తుచేసుకున్నారు. ఆదివారం బసవేశ్వర జయంతి సందర్భంగా ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు.ఆ కాలంలోనే పార్లమెంటరీ ప్రజాస్వామిక పాలన కు బసవేశ్వరుడు బీజం వేశారని చెప్పారు. ఏటా బసవేశ్వరుడి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదనీ, ఆయన బసవేశ్వరుని స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో ట్యాంక్‌బండ్‌పై కాంస్య విగ్రహం నెలకొల్పామనీ చెప్పారు. కోకాపేటలో బసవ భవన్ కోసం రూ.10 కోట్ల నిధులు కేటాయించామన్నారు.