Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలయాపన లేకుండా కొనుగోళ్లు ప్రారంభించాలి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయడానికి ఏడు వేల కేంద్రాలు తెరిచామనీ, కొనుగోళ్ళు కూడా ప్రారంభం చేసామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన వాస్తవాలకు దూరంగా వున్నదని పేర్కొన్నారు. మార్కెట్లలోకి వచ్చిన ధాన్యాన్ని వారాలు గడిచినా కొనకపో వడంతో రైతులు అక్కడే ఉండి ధాన్యానికి కాపలా కాస్తున్నారని తెలిపారు. రెండు రోజులుగా అకాల వర్షాల వల్ల మార్కెట్కు తెచ్చిన ధాన్యం తడిచిపోయిందని పేర్కొన్నారు. ఈ నష్టాన్ని మార్కెట్ కమిటీలే భరించాలని డిమాండ్ చేశారు. గత రెండు రోజులుగా అకాల వర్షాలు, పిడుగుపాటు వల్ల పంట నష్టం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలనీ, నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు రు.40వేలకు పైగా పెట్టుబడి పెట్టి పండించిన పంటలకు కోతల సమయం లో అకాల వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారనీ, తూకం వేయడానికి తేమను సాకుగా చూపి కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. తరుగు తీయడం, బిల్లుల్లో కోతలు పెట్టడం ద్వారా రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని తులిపారు.గతేడాది, అంతకుముందు సంవత్సరం ఏటా రు.500 కోట్ల కుంభకోణం జరిగినట్లు విచారణలో బయటపడిందని గుర్తుచేశారు. నల్లగొండ,సూర్యాపేట, మెదక్, వరంగల్ జిల్లాల్లో గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున వర్షం పడిందని తెలిపారు. వరి, పండ్ల తోటలు దెబ్బతిన్నాయనీ, జీవాలు చనిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టం వివరాల సేకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత వానాకాలం 90లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి, 62లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసి అ కేంద్రాలను ఎత్తివేశారని తెలిపారు. యాసంగిలో కూడా ఇప్పటి వరకు కొనుగోళ్లు ప్రారంభించకుండా కాలయాప న చేస్తున్నారనీ, మార్కెట్కు వచ్చిన ధాన్యానికి వర్షం నుంచి రక్షణ కల్పించే పరికరాలు రైతులకు అందుబాటులో ఉంచాలనీ, తడిచిన ధాన్యాన్ని మద్ధతు ధరకు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఆందోళనకు దిగకము ందే ప్రభుత్వం కొనుగోళ్ళు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.