Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ అస్తిత్వ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన సాహితీశిఖరం బాల శ్రీనివాసమూర్తి మరణం పట్ల తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ సాహిత్యానికి ఆయన అనితరసాధ్యమైన సేవలందించారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పురాణ ప్రబంధ తెలుగు సాహిత్య చరిత్రపై గట్టి పట్టున్న ఈ కాలం సాహిత్య విమర్శకుడని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మకథలమీద పరిశోధనాత్మకమైన గ్రంథం రాశారని గుర్తు చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమి వెలువరించిన సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర గ్రంథంలో ఆయన కృషి మరువలేనిదని తెలిపారు. ఆయన మరణం తెలుగు సాహిత్యానికి తీరనిలోటని పేర్కొన్నారు.