Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ బోర్డు కార్యదర్శికి ఏఐవైఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిబంధనలను ఉల్లంఘిస్తూ అడ్మిసన్లు నిర్వహిస్తున్న శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలపై కేసులు నమోదు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను సోమవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ బాలకృష్ణ, నిర్లకంటి శ్రీకాంత్ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇంటర్ బోర్డు నిబంధనలను బేఖాతరు చేస్తున్న కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజుల ఆగడాలను అరికట్టాలని, గుర్తింపు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం కోసం చర్యలు చేపట్టాలని సూచించారు.