Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిలను ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటున్నదని ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్లోని లోటస్ పాండ్లో విజయమ్మ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం షర్మిలను ఎందుకు అడ్డుకుం టుందో అర్థం కావడం లేదన్నారు. ప్రతి సారి హౌజ్ అరెస్టులతో అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్లు, పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయనీ, దీనిపై ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే తప్పేం టని నిలదీశారు. మహిళ అనే కనీస గౌరవం లేకుండా అంతమంది పోలీసులు పైన పడుతుంటే ఆవేశం రాదా? అని ప్రశ్నించారు. పది మంది మహిళా పోలీసులు తనపై పడుతూ, ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ నన్ను కార్లో ఎక్కించబోతే నాకు కూడా ఆవేశం వచ్చిందని చెప్పారు. పోలీసులు షర్మిల డ్రైవర్ను, గన్ మెన్లను , మీడియా వాళ్లను కొట్టారని వాపోయారు. ఈ విషయంపై కోర్డుకు వెళ్తామని హెచ్చరించారు.