Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనారిటీ రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు
- అమితాషా వ్యాఖ్యలపై మంత్రి కొప్పుల ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
పగటేషగాళ్ల మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మబోరని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆదివారం చేవెళ్ల సభలో చేసిన వ్యాఖ్యలపై కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీలకు రిజర్వేషన్లనేవి రాజ్యాంగం కల్పించిన హక్కని తెలిపారు. తెలంగాణ సమాజం గురించి అమిత్షా కు ఏం తెలుసని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు సభలు.. సమావే శాలు పెట్టు కుని పబ్బం గడిపేవారు కేసీఆర్ను విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. అధికారం లోకి వస్తే మైనారిటీ రిజర్వేన్లు తొలగిస్తామని చెప్పడం రాజ్యంగాన్ని అపహాస్యం చేయడమేనని తెలిపారు. దీన్ని బట్టే అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల పట్ల వీరి చిత్తశుద్ధి ఏపాటితో విదితమవుతున్నదని ఎద్దేవా చేశారు. ఇదేనా బీజేపీ నేతలకు రాజ్యాంగం పట్ల ఉన్న నమ్మకం అని ప్రశ్నించారు.దళిత, మైనారిటీ వర్గాలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.