Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడవులకు పునరుజ్జీవం
- హారితహారం కింద సాగునీటిశాఖ భారీగా సన్నాహాలు
నవతెలంగాణ-హైదరాబాద్
నీటిపారుదల శాఖ పరిధిలోని ఖాళీగా ఉన్న భూము ల్లో భారీగా తోటల పెంపకం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం హరితహారం కింద రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయనుంది. ఇది తగ్గిపోతున్న అడవుల ను పెంపకంలో సహాయపడటమే కాకుండా తాజాగా అందుబాటులో ఉన్న సర్వేల ప్రకారం ఏడు శాతం పచ్చదనాన్ని పెంచడంలో దోహదపడనుందని సర్కారు అంచనా. 2022-23 సంవ త్సరంలో జిల్లాల వారీగా నీటిపారుదల భూములలో తోటల కోసం అందుబాటులో ఉన్న కాలువల వెంట నాటాలని నీటిపారుదల భావిస్తు న్నది. అలాగే లీనియర్ ప్లాంటేషన్ కింద 5408.53 కిలోమీటర్ల విస్తీర్ణం, బ్లాక్ ప్లాంటేషన్ కింద 1782 ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రణాళిక రూపొందించారు.
మొక్కలు ...
9475.68 కిలోమీటర్ల విస్తీర్ణంలో 2767.31 కిలోమీటర్లలో ప్లాంటేషన్ చేపట్టగా 13,42,173 మొక్కలు నాటారు. 3875.26 ఎకరాల విస్తీర్ణంలో 590.04 ఎకరాల్లో ప్లాంటేషన్ చేపట్టగా 6,01, 385 మొక్కలు నాటారు.
ఆయా జిల్లాల్లో
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, పెద్దపల్లి, వనపర్తి, జోగు లాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, సిద్దిపేట, సూర్యా పేట, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ తోటలను పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయి లో ఏడు బృందాలను ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల, నిర్మల్, మంచి ర్యాల, నిజామాబాద్, మహబూబాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, కరీంనగర్, వరంగల్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, మహ బూబ్‌నగర్ జిల్లాల్లోని ప్లాంటేషన్లను క్వాలిటీ కంట్రోల్ సెల్ ఆధ్వర్యం లో సీనియర్ క్వాలిటీ కంట్రో ల్ ఆఫీసర్ (ఎస్క్యూసీఓ), జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ (జేక్యూసీఓ), ప్లాంటేషన్ మేనేజర్ పరిశీలిం చారు. కానుగ, ఈత, గుల్మోహర్, సీమ తంగేడు, రెయిన్ ట్రీ, సీతాఫల్, దిరిశెన, పెల్టోఫోరం వంటి జాతుల మొక్కలను ఈ జిల్లాల్లో నాటడం జరిగింది. క్షేత్రస్థాయిలో ప్లాంటేషన్లను పరిశీలించిన అధికా రులు క్షేత్ర స్థాయి సిబ్బంది అందరికీ అవగాహన అవసరమని భావించారు. మొక్క లు కట్టే ఏర్పాట్లు, పొడవాటి మొక్కల వినియోగం, అంచనా తయారీ, మొక్కల మధ్య అంతరం పాటించాలని, వేప, చింత పండు, జామున్, బాబుల్, నీరుమద్ది, మారేడు, కాసురినా, వెదురు మొదలైన స్థానిక జాతులను ప్లాంటేషన్ కోసం ప్రతిపాదించారు. అవసరమైన చోట సాధరణ రీప్లేస్మెంట్ అవసరమని అధికారులు సూచించారు. పశువులు మేయకుండా ఫెన్సింగ్ వేయాలనీ, తోటల మంచి మనుగడకు ఎరువులు వేయడం, కలుపు తీయడం, నీరు పెట్టడం మొదలైన అన్ని పనులు చేయాల్సిన అవసరముందని సూచించారు. ఈమేరకు సమా చార, పౌరసంబంధాల శాఖ సోమవారమొక ప్రకటన జారీచేసింది.