Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యసిబ్బందికి మంత్రి హరీశ్‌రావు అభినందనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
2021-22 సంవత్సరానికిగాను ఆస్పత్రుల్లో వంద శాతం డెలివరీలతో దేశానికే తెలంగాణ మార్గ దర్శకంగా నిలిచిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. కేసీఆర్ కిట్ కార్యక్రమం లక్ష్యానికి ఇది నిజమైన నిదర్శనమని పేర్కొన్నారు. గర్భవిచ్ఛిత్తికి సంబంధించి దేశంలోనే అతి తక్కువ కేసులు నమోదవుతున్నరెండో రాష్ట్రంగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. నవజాత శిశువులకు మొదటి గంటలోనే ముర్రుపాలు అందించడంలో 80.75 శాతం, హెపటైటీస్ బీ వ్యాక్సినేషన్లో 104 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామని తెలిపారు. మీజిల్స్, రుబెల్లాకు వంద శాతం వ్యాక్సినేషన్, దేశంలోనే పూర్తి నిర్వహణ, పరికరాలు కలిగిన ఫస్ట్ రెఫరల్ యూనిట్లు మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు.
డెలివరీ డేట్‌ను ముందే చెప్పేలా వంద శాతం పరీక్షలు జరుగుతున్నాయనీ, నెలలు తక్కువ గా జన్మించే చిన్నారుల విషయంలో 1.2 శాతంతో దేశంలోనే అతి తక్కువగా ఉందనీ, జన్మించే సమ యంలో బరువు తక్కువగా ఉన్న చిన్నారుల శాతం 6.2గా వివరించారు. లింగ నిష్పత్తి జాతీయ సగటు కన్నా చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ విజ యాల కోసం కృషి చేసిన డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.