Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ వర్కర్ల గ్రాట్యూటీపైన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో ఐసీడీఎస్ డైరెక్టర్ లక్ష్మీదేవికి ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.పద్మ, పి.జయలక్ష్మి, కోశాధికారి కె.సునీత వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ ఉద్యోగులను కార్మికులుగా పరిగణించాలనీ, గ్రాట్యూటీ చెల్లింపు 1972 చట్టం ప్రకారం గ్రాట్యూటీకి వారు అర్హులని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. మెరైగన పని పరిస్థితులను కల్పించేందుకు విధివిధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలనే ఆదేశాలను పాలకులు బుట్టదాఖలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతూ ఏఐఎఫ్ఏడబ్ల్యూహెచ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్టు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలనీ, కనీస వేతనాలు, పింఛన్ చెల్లింపులకు తగిన ఆర్థిక కేటాయింపులు, ఐసీడీఎస్ పటిష్టత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.