Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అకాల వర్షంతో తడిసిన ధాన్యం
- ధాన్యాన్ని తగలబెట్టి రైతుల రాస్తారోకో
నవతెలంగాణ-ముదిగొండ
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి వారం దాటినా నిర్వాహకులు కొనుగోలు చేపట్టడం లేదని ఆగ్రహించిన రైతులు సోమవారం ప్రధాన రహదారిపై ధాన్యాన్ని తగలబెట్టి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు ఆలస్యం కావటంతో అకాలవర్షంతో కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 17న గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ చైర్మెన్ లింగాల కమల్ రాజు ప్రారంభించారని, ప్రచార ఆర్భాటమే తప్ప కొనుగోలు చేయటం లేదని రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్ఐ గజ్జెల నరేష్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపచేశారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ గుగులోతు క్రాంతిబాబు నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు, సీపీఐ(ఎం) నాయకులు తొర్తి సైదులు, బొడ్డు శ్రీను, దేవరపల్లి వెంకట్, పలువురు రైతులు పాల్గొన్నారు.