Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ జహీరాబాద్
మహేంద్ర అండ్ మహేంద్ర ఎలక్ట్రిక్ వాహ నాల ఉత్పత్తి కేంద్రం శంకుస్థాపన సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర అధ్య క్షులు, మహేంద్ర అండ్ మహేంద్ర యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు ప్రసంగం సభికులను, మంత్రిని ఆకట్టుకుంది. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహేంద్ర అండ్ మహేంద్ర పరిశ్రమలో రూ.వెయ్యి కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కేంద్రం శంకుస్థాపనకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. 'కార్మికులు, పరిశ్రమ యాజమాన్యం, ప్రభుత్వం సవ్యంగా ఉంటే ఆ రాష్ట్ర అభివద్ధి చెందుతుంది. రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తాయి' అని మహేంద్ర కార్మిక యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు అనడంతో... ఆ మాటలకు ఆకర్షితులైన మంత్రి కేటీఆర్ హర్షద్వనాలతో చుక్క రాములును అభినందించారు. సీఐటీయూ యూనియన్ రాష్ట్ర అభివద్ధికి, కార్మికులు, యాజమాన్యాల సంక్షేమానికి అన్ని విధాలాకషి చేస్తుందని చుక్క రాములు అన్నారు. అపార అనుభవం కలిగిన చుక్క రాములు మహేంద్ర యాజమాన్యాన్ని అన్ని విధాలా ఒప్పించగలుగుతున్నారని కార్మికులు చర్చించుకున్నారు.