Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాల కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అకాల వర్షాలతో వివిధ జిల్లాలో జరిగిన పంట నష్టంపై వివరాలను అందించాలంటూ జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లతో సీఎస్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం వివరాలను వచ్చేనెల ఒకటో తేదీలోగా సమర్పించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ హనుమంతరావు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ప్రతి మండలానికీ ప్రత్యేక అధికారులను నియమించి జరిగిన పంట నష్టం వివరాలను సమర్పించాలని సీఎస్ కోరారు. గతంలో జరిగిన పంట నష్టానికి సంబంధించి పరిహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి పంపిణీ చేయనున్నట్టు వివరించారు. రాష్ట్రంలో మరికొన్ని రోజులపాటు ఉరుములతో కూడిన వర్షాలు సంభవించే అవకాశమున్నందున ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడవకుండా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు.