Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోవా సీఎం ప్రమోద్ సావంత్‌కు 'నమో వందే గోమాతరం' వినతి
నవతెలంగాణ-అంబర్‌పేట
గోవుల సంరక్షణ బాధ్యత గోవా నుంచే ప్రారంభించాలని గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్‌ను నమో వందే గోమాతరం విజ్ఞప్తి చేసింది. నమో వందే గోమాతరం నేషనల్ ప్రెసిడెంట్ పెరిక సురేష్ ఆధ్వర్యంలో సోమవారం గోవా ముఖ్యమంత్రి సావంత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సీఎం సావంత్‌ను శాలువాతో సత్కరించి గోవు ప్రతిమను బహూకరించారు. ఈ సందర్భంగా సురేష్ భారతీయ సంస్కతికి, వారసత్వానికి ప్రతిరూపమైన గోమాతను సంరంక్షించాల్సిన అవసరముందని, అది గోవా నుంచే ప్రారంభించాలని సీఎం సావంత్‌ను కోరారు.
దానికి గోవా సీఎం సానుకూలంగా స్పందించారని సురేష్ వెల్లడించారు. నమో వందే గోమాతరం ఆధ్వర్యంలో గోవులను రక్షించే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీఎంలను కలిసి గోహత్యలను నిషేధం కఠినంగా అమలు చేయాలని కోరనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ సెక్రటరీ మున్నంగి రమణరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కట్టా రవి చారీ, తెలంగాణ సెక్రటరీ తోట కిరణ్ తదితరులు పాల్గొన్నారు.