Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులతో షర్మిల దురుసు ప్రవర్తన..
నవతెలంగాణ-బంజారాహిల్స్
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సోమవారం సాయంత్రం నాంపల్లి కోర్డు 14 రోజుల రిమాండ్ విధించింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్‌ను కలిసేందుకు వెళుతున్న వైఎస్ షర్మిలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అడ్డుకోవడంతో లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో షర్మిలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసు కుంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ గిరిబాబు కాలు మీద కారు ఎక్కించిన షర్మిల కాన్వారు ఇద్దరు డ్రైవర్ల మీద కేసులు నమోదయ్యాయి. ఏ1గా షర్మిల, ఏ2గా కారు డ్రైవర్ బాలు, ఏ3గా మరో డ్రైవర్ జాకబ్ పేర్లు చేర్చారు.. షర్మిలను అరెస్టు చేసి, ఆ తర్వాత గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. శాంతిభద్రతల కోసం 24 గంటలు పోలీసు లు పని చేస్తారని, అలాంటి వారిపై చేయి చేసుకో వడం వల్ల సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని, షర్మిలను రిమాండ్‌కు ఇవ్వాలని పోలీసులు వాదనలు వినిపించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అడ్డుకుని షర్మిలపై దురుసుగా ప్రవర్తిం చారని, ఆత్మ రక్షణలో భాగంగానే పోలీసులు నెట్టి వేయాల్సి వచ్చిందని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చా రు. రిమాండ్ తిరస్కరించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి షర్మిలకు మే 8 వరకు రిమాండ్ విధించింది.
సోమవారం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్‌ను కలిసేందుకు వెళుతున్న వైఎస్ షర్మిలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అడ్డుకోవడంతో లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో షర్మిలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. షర్మిల ఆగ్రహానికి లోనై ఓ పోలీసును తోసేశారు. పోలీసుల తీరుకు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. తనను ఎందుకు నిర్బంధించారో చెప్పాలని నేలపై కూర్చొని పోలీసుల ను ప్రశ్నించారు. పోలీసులు అడ్డుగా ఉన్నా లెక్క చేయకుండా కారులో ముందుకు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నించారు. అయినా, పోలీసులు అడ్డు తొలగ లేదు. దీంతో షర్మిల..అక్కడే విధుల్లో ఉన్న పోలీసు అధికారుల దగ్గరకు వెళ్లి వారిపట్ల దురుసుగా ప్రవర్తించారు. మధ్యలో అడ్డుకున్న మహిళా కానిస్టే బుళ్లను తోసివేసి చేయి చేసుకున్నారు. షర్మిలను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకుని షర్మిలను కలిసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆమె తల్లి విజయమ్మను పోలీసులు అడ్డుకు న్నారు. ఆ సందర్భంలో కూడా విజయమ్మ మహిళా పోలీసులను నెట్టివేసి తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు. మహిళా పోలీస్‌పై చేయి చేసుకున్నట్టు వీడియో వైరల్ అయింది. తాను ఎవరిమీద కావాలని చేయి చేసుకోలేదని విజయమ్మ అన్నారు.
సచివాలయం, సిట్ ఆఫీస్‌కు వెళ్లి హడావుడి చేయాలని షర్మిల ప్లాన్ : సీపీ ఆనంద్
షర్మిల ఎపిసోడ్‌పై పోలీసులు రియాక్ట్ అయ్యా రు. హైదరాబాద్ సీపీ సీవీఆనంద్ మాట్లాడు తూ సచివాలయం, సిట్ ఆఫీస్‌కు వెళ్లి ఏదైనా హడావుడి చేయాలని షర్మిల ప్లాన్ చేశారని అన్నారు. అందుకే ముందస్తు సమాచారంతో ఆమెను హౌస్ అరెస్టు చేసేందుకు యత్నించామన్నారు. గతంలో ఆమె చేసిన చర్యలు కారణంగానే ఇప్పుడు ముందస్తు జాగ్ర త్తలు తీసుకున్నట్టు తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్‌పై దాడి కేసులో పూర్తి విచారణ జరుగుతున్నదని వివరించారు. అంతకంటే ముందు మాట్లాడిన డీసీపీ జోయల్ డెవిస్... ఎస్సైను షర్మిల కొట్టారన్నారు.
షర్మిలను పరామర్శించిన భర్త అనిల్
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్న వైఎస్ షర్మిలను ఆమె భర్త బ్రదర్ అనిల్ పరామర్శించారు. జరిగిన ఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసు కున్నారు. అలాగే ఆమెను పరామర్శించేం దుకు ఆమె తల్లి విజయలక్ష్మి, పార్టీ నాయకులు గట్టు రామ చంద్రరావు రాగా వారికి అనుమతి ఇవ్వలేదు.