Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని గోళ్లపాడు, పొన్నెకల్లు గ్రామాల్లో మంగళవారం తమ్మినేని పర్యటించి తడిసిన ధాన్యాన్ని, నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి మామిడి తోటలకు రూ.50 వేలు, వరి పంటకు 30 వేలు, మొక్కజొన్న రైతులకు ఎకరానికి రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ను స్వయంగా కలిసి రైతుల బాధలను వివరిస్తానన్నారు. ఆయన వెంట రైతు సంఘం నాయకులు బండి రమేష్, ఉరడీ సుదర్శన్ రెడ్డి, నండ్ర ప్రసాద్, తోట పెద్ద వెంకట రెడ్డి, వరగాని మోహన్ రావు, వీరయ్య, యండపల్లి వెంకటరామయ్య, కొప్పుల రామయ్య, పుచ్చకాయల నాగేశ్వరరావు, కొండం కరుణాకర్, చామకూరి రత్నం, వడ్లమూడి నాగేశ్వరరావు, కారుమంచి గురవయ్య, కొప్పుల ఉపేందర్, సిలువేరు బాబు, నూతలపాటి రామారావు ఉన్నారు.