Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో తీవ్రమవుతున్న విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడుదామని ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (పీడీఎస్ఎఫ్) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆవుల నాగరాజు, కుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా సంక్షోభాన్ని కారణంగా చూపి హేతుబద్ధీకరణ పేరుతో ఎన్సీఈఆర్టీ తొమ్మిది, పదో తరగతి సైన్స్ పాఠ్యపుస్తకాల నుంచి చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం శాస్త్రీయ దృక్పథాన్ని, హేతుబద్ధమైన ప్రపంచ దృక్పథాన్ని పెంపొందించ డానికి దోహదపడుతుందని తెలిపారు. 11, 12వ తరగతి సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం పాఠ్యాంశాల్లో నుంచి మహాత్మాగాంధీ హత్య, హిందూ ముస్లింల ఐక్యత, గుజరాత్ అల్లర్లు వాటి పరిణామాలు, ఎమర్జెన్సీ పాఠాలను, 12వ తరగతి చరిత్ర పుస్తకంలో నుంచి మోఘల్ సామ్రాజ్యం పాఠ్యాంశాన్ని తొలగించిందని తెలిపారు.