Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశించారు. మంగళవారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో పంచాయతీ అధికారులు, జెడ్పీ సీఈఓలు, డీఆర్డీఓలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిం చారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను మరింత పకడ్బందీగా అమలు చేయడంపై ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్ ప్రోగ్రాం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగేండ్లుగా ఉద్యమంగా అధికారులు పనిచేయడం వల్లనే గ్రామాల రూపురేఖలు మారాయని చెప్పారు. ఇదే స్ఫూర్తితో అధికారులు పనిచేయాలని సూచించారు. తడి, పొడి చెత్త సేకరణ, డంపింగ్ యార్డుల ద్వారా వర్మికంపోస్టు తయారీ ద్వారా ఆదాయం పొందేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి అవార్డులుసాధించిన గ్రామపంచాయతీలకు సంబంధించి డీపీఓలు, బెడ్పీ సీఈఓలు, డీఆర్డీఓలకు ప్రశంసాపత్రాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ హన్మంతరావు అందజేశారు.