Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ ఓబీసీ సమావేశంలో వీహెచ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీగణన చేస్తామంటూ హామీనిచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి కాంగ్రెస్ ఓబీసీ నేతలు అభినందనలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో మాజీ ఎంపీ వి. హనుమంతరావు అధ్యక్షతన ఓబీసీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జి. నిరంజన్, సంగిశెట్టి జగదీష్, లక్ష్మణ్ యాదవ్, రాజ్ ఠాకూర్, నగేష్ ముదిరాజ్, నూతి శ్రీకాంత్, సునీతారావు, మెట్టు సాయికుమార్, శ్రీకాంత్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ కులగణన చేపట్టాలనీ, వారికి బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ రాహుల్‌గాంధీ డిమాండ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీకులగణన జరిపితే జనాభా సంఖ్య ప్రకారం రిజర్వేషన్లు పెరిగి వారికి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయాన్ని వీహెచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.