Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఇదే కేసులో ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ అందనందున విచారణను వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ సురేందర్ చెప్పారు. వివేకా హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మరో జడ్జి జస్టిస్ సుమలత విచారణను బుధవారానికి వాయిదా వేశారు. కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఏపీ హైకోర్టు రద్దు చేసేందుకు అంగీకరించలేదనీ, ఇప్పుడు అదే తరహా సీబీఐ పిటిషన్లో తెలంగాణ హైకోర్టు విచారణ చేయాల్సిన అవసరం లేదని గంగిరెడ్డి న్యాయవాది చెప్పారు. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందనీ, బెయిల్రద్దు చేయాలని సీబీఐ లాయర్ వాదించారు.