Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- విలేకరులు
తమ సమస్యలపై సమ్మె చేస్తున్న ఐకేపీ వీఓఏలు మంగళవారం పలు రూపాల్లో నిరసన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వీవోఏల దీక్షకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య సంఘీభావం తెలిపారు. కరకగూడెం, భద్రాచలంలో కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. పాల్వంచలో సీఐటీయూ జిల్లా కోశాధికారి పద్మ సంఘీభావం తెలిపారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలకేంద్రంలో వీవోఏలు కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సమ్మెకు సీపీఐ(ఎం), టీడీపీ, బీఎస్పీ, ఎమ్మార్పీఎస్, రజక సంఘాల నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో వీఓఏలు కండ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.