Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గుర్తింపు లేకున్నా ప్రయివేటు విశ్వవిద్యాలయాల పేరుతో ప్రచారం చేస్తూ, పరీక్షలు నిర్వహిస్తున్న గురునానక్, శ్రీనిధి వంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకున్నా ప్రయివేటు విశ్వవిద్యాలయాల పేరుతో లక్షల రూపాయలను విద్యార్థుల నుంచి వసూళ్లు చేస్తూ అడ్మిషన్లు చేపట్టాయని విమర్శించారు. వాటికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందకుండా శ్రీనిధి, గురునానక్ పరీక్షలు షెడ్యూల్ ఇచ్చాయని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం కూడా అందమైన బ్రోచర్లు వేస్తూ ముందస్తుగా అడ్మిషన్లు చేస్తున్నారని పేర్కొ న్నారు. ప్రభుత్వ అనుమతుల్లేకుండా రూ.లక్షల్లో ఫీజులు వసూళ్లు చేసి, విద్యార్థులను మోసం చేస్తున్న శ్రీనిధి, గురునానక్ ప్రయివేటు వర్సిటీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.