Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ అనస్తీషియా విద్యార్థి ప్రీతిని సైఫ్ అనే మరో మెడికో వేధించారనీ, అతని స్నేహితులతో కలిసి విషమిచ్చి హత్య చేశారని రాష్ట్ర ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లయ్య రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం నోటీసులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మెడికల్ అండ్ హెల్త్ ముఖ్య కార్యదర్శి, డీఎంఈ, వరంగల్ పోలీస్ కమిషనర్, కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, అనస్తీషియా విభాగం చీఫ్‌లకు నోటీసులిచ్చింది. విచారణను జూలై 28కి వాయిదా వేసింది. ప్రీతిని కులం పేరుతో వేధించారనీ, ర్యాగింగ్ చేశారని మల్లయ్య అందులో పేర్కొన్నారు. సైఫ్ తన స్నేహితులతో కలిసి విషమిచ్చి ఆమె చావుకు కారణమయ్యారని ఆరోపించారు. పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని చెప్పారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు.