Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కోరుతున్న ఆర్టిజన్లను రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు అరెస్టు చేయించడం దారుణమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఖండించారు. వారిపై నిర్బంధ చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు రోజులుగా ఆర్టిజన్లను పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం, డ్యూటీలకు వెళ్ళే వారినీ, అర్ధరాత్రి ఇంటికెళ్ళి నాయకులను అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్నారు. డ్యూటీలో లేని వారిని కూడా సర్వీస్ నుంచి తొలగించాలని చట్ట విరుద్ధంగా యాజమాన్యం ఆదేశాలివ్వడం అన్యాయ మని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించిన విద్యుత్ అర్టిజెన్లను వెంటనే విడుదల చేయాలనీ, వారి న్యాయమైన కోర్కెల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం, ట్రాన్స్కో, డిస్కమ్ యాజమాన్యాలు కృషి చేయాలని కోరారు.