Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేర్వేరు తేదీల్లో నిర్వహించాలి : ఏఐఎస్ఎఫ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఈనెల 30న ఒకేరోజు నాలుగు పరీక్షలను నిర్వహిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పరీక్షలను ఒకే రోజు నిర్వహించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇది నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడడమేనని విమర్శించారు. ఒకే రోజు కాకుండా వేర్వేరు తేదీల్లో ఆయా పరీక్షలను నిర్వహించాలని కోరారు. నిరుద్యోగులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.