Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్ఏఓయూ) డిగ్రీ మూడు, రెండు, మొదటి సంవత్సరం (పాత బ్యాచ్) 2016, అంతకు ముందు బ్యాచ్ విద్యార్థులకు వచ్చేనెల 31 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి పి వెంకట రమణ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు వచ్చేనెల 31 నుంచి జూన్ ఐదో తేదీ వరకు, రెండో సంవత్సరం పరీక్షలు జూన్ ఏడు నుంచి 14వ తేదీ వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు అదేనెల 16 నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది వచ్చేనెల పదో తేదీ వరకు ఉందని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు విశ్వవిద్యాలయ పోర్టల్ www.braouonline.inలో నమోదు చేసుకోవాలని సూచించారు. పరీక్ష ఫీజును టీఎస్/ఏపీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డుతో మాత్రమే చెల్లించాలని కోరారు.