Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:మహారాష్ట్రలోని యావత్ మాల్ జిల్లా పరిధిలోని పఠాన్ బురి, కెలాపూర్, కరంజి, కైర్గొవ్, సున్న, వంజ్రి, కోపమంద్వి, పిప్పల్కుంటి, కొడ్డురి, పందర్కొద, మాంద్వి, చిల్కల్ వార్డ, పార్వ, తదితర గ్రామాలకు చెందిన వారు బీఆర్ఎస్ లో చేరారు. మంగళవారం హైదరా బాద్‌లోని బంజారా హిల్స్‌లో హౌం మంత్రి మహమూద్ అలీ నివాసంలో వారు ఆయన్ను కలిశారు. ఈ సందర్భ ంగా మంత్రి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మహా రాష్ట్రలో బీఆర్ ఎస్‌కు అపూర్వ స్పందన లభిస్తున్నద నీ, తెలంగాణ మోడల్ అక్కడ అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరిం చారు. కేసీఆర్ నాయకత్వాన్ని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి సందర్బంగా తెలిపారు. పార్టీలో చేరిన ఉపసర్పంచ్ మధుకర్ అల్లూర్ వార్ మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు తమను ప్రభావితం చేశాయని తెలిపారు.