Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల వెల్ఫేర్ బోర్డు సీఈఓ గంగాధర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమలు తీరులో అవినీతి జరుగు తున్నదన్న వార్తలో వాస్తవం లేదని తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల వెల్ఫేర్‌బోర్డు కార్యదర్శి, సీఈఓ ఈ.గంగాధర్ తెలిపారు. వెల్ఫేర్బోర్డులో వేల కోట్ల దుర్వినియోగం పేరుతో పత్రికల్లో వచ్చిన కథనాల ను ఆయన రిజాయిండర్ ద్వారా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ బోర్డు ప్రభుత్వ అజమాయిషీలో పనిచేసే స్వయం ప్రతి పత్తిగల సంస్థ అని పేర్కొన్నారు. తమకు బడ్జెట్ ద్వారా నిధులు రావనీ, కార్మికుల సెస్సు, రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్ ఫీజుల ద్వారానే నిధులను సమకూర్చుకుంటామని స్పష్టం చేశారు. తమ సొంత నిధులను సంక్షేమ పథకాలపై ఖర్చుచేసిన వివరాలతో పోల్చడం సరిగాదని పేర్కొన్నారు. ఈ ఏడాది అన్ని పథకాలపై తాము ఖర్చుచేసింది రూ.411.5 కోట్లు మాత్రమేననీ, రూ.1419 కోట్లు కాదని స్పష్టం చేశారు. లబ్ది దారుల క్లయిమ్స్ స్వీకరణ దశ నుంచి పరిశీలన, అనుమతి, చివరకు క్లయిమ్ మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లోనే జమ చేయడం వరకు మూడో వ్యక్తి ప్రమేయమే ఉండబో దని తెలిపారు. లబ్దిదారుల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమచేస్తున్నామని తెలిపారు. వ్యవస్థలోని లోపాలను ఎప్పటి కప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలి పారు. బోర్డు జమా ఖర్చులు సీఏ ద్వారా అంతర్గత ఆడిట్‌తో పాటు అకౌంటెంట్ జనరల్‌తోనూ ఆడిట్ చేయిస్తామని పేర్కొన్నా రు. సెస్సు వసూలు విషయం లో అవకతవకలు జరగలేద నీ, మెట్రో రైలు కేసు కోర్టులో ఉందని తెలిపారు. బోర్డుకు సంబంధించిన వార్తలు రాసే సమయంలో తమను సంప్రది ంచాలని సూచించారు.