Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన జూబ్లీహిల్స్ సామూహిక లైంగికదాడి కేసులో గతంలో ఫోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలని అదే కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఆరో నిందితుడిని మేజర్‌గా పరిగణిస్తూ ఇచ్చిన పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని నిందితుడి తల్లి వేసిన పిటిషన్‌ను జస్టిస్ జి.అనుపమ చక్రవర్తి విచారణ జరిపి పైవిధంగా ఆదేశాలిచ్చారు. 2022 మే 28 స్నేహితులతో కలిసి అమ్నేసియా పబ్ కేసులో ఫ్రెషర్స్ డే పార్టీకి వెళ్లిన తనపై సామూహిక లైంగికదాడి జరిగిందని మైనర్ బాలిక మీడియాకు చెప్పింది.