Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతికి వేధింపుల వల్లే...
నవతెలంగాణ- నస్పూర్
ప్రేమ పేరుతో యువతిని తరచూ వేధించడంతోపాటు.. ఆమె వివాహబంధం విచ్ఛిన్నమవ్వడానికి కారణమైన యువకుడిని బాధిత కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని గంగపుత్ర కాలనీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముష్కే మహేష్(25) అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధించేవాడు. విషయం తెలియడంతో యువతికి తల్లిదండ్రులు మరో వ్యక్తితో వివాహం చేశారు. ఆ తర్వాత కూడా యువకుడు వెంటపడుతూ వేధించాడు. అది తెలిసిన ఆమె భర్త విడాకులు ఇవ్వడంతోపాటు, ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం యువతి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. తమ కూతురు జీవితం ఆగం కావడానికి కారణమైన యువకున్ని తల్లిదండ్రులు, సోదరుడు కలిసి అతన్ని పట్టుకున్ని కొట్టారు. తలపై రాయితో మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. జైపూర్ ఏసీపీ నరేందర్, శ్రీరాంపూర్ సీఐ రాజు సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలను పరిశీలించారు. విచారణ చేపట్టి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు.