Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లెల్లో 200 రోజులు పని కల్పించాలి
- ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్ .పుణ్యవతి
- మహిళలపై హింసకు పాల్పడుతున్న దోషులకు కేంద్రం అండ :రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
ఉపాధిహామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాల్లో అమలు చేసి 200 రోజులు పనిదినాలు కల్పించాలని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి డిమాండ్ చేశారు. ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు రెండు రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణకేంద్రంలోని మున్నూరు కాపు సత్రం లో నిర్వహించారు. సమావేశం అనంతరం మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పుణ్యవతి మాట్లాడుతూ.. పేదలకు ఉపాధి లేక అల్లా డుతుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారిపై భారాలు వేస్తూ అదానీ, అంబానీలకు దోచిపెట్టడంపై ఐద్వా ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ప్రజల ను చైతన్యం చేస్తామన్నారు. 2014లో 69వ స్థానంలో ఉన్న అదానీ ప్రపంచ కుబేరుల్లో 2వ స్థానానికి వెళ్లటానికి మోడీ ప్రభుత్వం అనుసరించిన విధాన మే కారణమన్నారు. పేదల నుంచి కుబేర్లకు దోచిపెడుతున్న విధానాలపై వివిధ భాషలో పుస్తకాలు ప్రచురించి దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేయబో తున్నామని, అనంతరం అక్టోబర్ 5న డిల్లీలో భారీ సభ నిర్వహిస్తామని చెప్పా రు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. మహిళల ఆహారం, వస్త్రధారణపై ఆంక్షలు పెడుతూ మనువాద భావజాలాన్ని అమలు చేస్తూ మహిళలపై హింసకు పాల్పడుతున్న దోషులకు అండగా కేంద్ర ప్రభు త్వం వ్యవహరిస్తున్నదన్నారు. మహిళల హక్కులు హరించే విధానాలకు వ్యతి రేకంగా మహిళలను చైతన్యం చేసేందుకు రాష్ట్ర కమిటీలో కార్యాచరణ రూ పొందించుకున్నామని తెలిపారు. ఉపాధి హామీ, డ్వాక్రా సమస్యలపై సర్వే చేసి, ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు ఇవ్వ డంతో పాటు అవసరమైతే ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు. సమా వేశంలో రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి, ఉపాధ్యక్షులు బి.హైమావతి, కేఎన్ ఆశాలత, యాదాద్రి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అవ్వారి రామేశ్వరి, బట్టుపల్లి అనురాధ, తదితరులు పాల్గొన్నారు.