Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్
నవతెలంగాణ-హైదరాబాద్
తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలుగు దేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటిం చారు. మే 28 ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా 100 ప్రత్యేక సభలను చేపడతామని తెలియ జేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పార్లమెంటు నియోజక వర్గాల వారీగా ఎన్టీఆర్ శతజయంతి సభలను నిర్వహించేందుకుగాను కార్యాచరణను సిద్ధం చేశామని చెప్పారు. తెలంగాణలో 17 చోట్ల, ఆంధ్రప్రదేశ్లో 25 చోట్ల ఈ సభలు జరుగుతాయని చెప్పారు. మొత్తం 100 చోట్ల ఎన్టీఆర్ శత జయంతి సభల ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో ఈనెల 29 నుంచి వచ్చే నెల మే 20 వరకు నిర్వహిస్తామన్నారు. ఎన్టీఆర్ సినీ జీవితం, రాజకీయ రంగప్రవేశం, ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమ పాలన ప్రాముఖ్యతలను గుర్తు చేస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్టు కాసాని వివరించారు. ఈమేరకు ప్రత్యేక సభల షెడ్యూల్ను ఖరారు చేశామన్నారు.
సభల షెడ్యూల్
ఏప్రిల్ 29న జహీరాబాద్ పార్లమెంటు - వర్ని(బాన్సువాడ నియోజక వర్గం), మే 3న మహబూబ్నగర్ పార్లమెంటు - మహబూబ్నగర్ టౌన్, మే 4న భువనగిరి పార్లమెంటు - చౌటు ప్పల్ (మునుగోడు నియోజకవర్గం), మే 6న హైదరాబాద్ పార్లమెంటు - కార్వాన్ (కార్వాన్ నియోజకవర్గం), మే 7న ఖమ్మం పార్లమెంటు - ఖమ్మం టౌన్, మే 8న మహబూబాబాద్ పార్లమెంటు - ములుగు , సికింద్రాబాద్ పార్లమెంటు - ఖైరతాబాద్ నియోజకవర్గం, మే 10న మెదక్ పార్లమెంటు - నరసాపూర్ , మే 11న ఆదిలాబాద్ పార్లమెంటు - ఉట్నూరు ,మే 12న కరీంనగర్ పార్లమెంటు - కరీంనగర్ నగరం, మే 13న నాగర్ కర్నూలు పార్లమెంటు - కొల్లాపూర్ , మే 14న పెద్దపల్లి పార్లమెంటు - మందమర్రి టౌన్ ( చెన్నూరు నియోజకవర్గం), మే 15న చేవెళ్ల పార్లమెంటు - పరిగి టౌన్, మే 16న వరంగల్ పార్లమెంటు - వరంగల్ నగరం, మే 17న నిజామాబాద్ పార్లమెంటు - ఆర్మూరు టౌన్, మే 19న మల్కాజ్గిరి పార్ల మెంటు - బాచుపల్లి(కుత్బుల్లాపూర్ నియోజకవర్గం), మే 20న నల్లగొండ పార్ల మెంటు - మిర్యాలగూడ టౌన్లో ప్రత్యేక సభలు జరుగుతాయని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.