Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి పిల్లల వేడుకోలు
- స్పౌజ్ బదిలీలు చేపట్టాలి
- 13 జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఉపాధ్యాయుల నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మా అమ్మానాన్నలను కలపండి'అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని పిల్లలు వేడుకున్నారు. ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. స్పౌజ్ బదిలీలను వెంటనే చేపట్టాలంటూ ఉపాధ్యాయ కుటుంబాలు రోడ్డెక్కాయి. 13 జిల్లాల కలెక్టరేట్ల ఎదుట టీచర్లు మంగళవారం శాంతియుతంగా నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలని, స్పౌజ్ బదిలీలు చేపట్టాలని కోరారు.
జీవో 317 అమల్లో భాగంగా ఉపాధ్యాయ దంపతులను ఒకే జిల్లాకు కేటాయించాల్సి ఉందని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల 13 జిల్లాల్లో వారి బదిలీలు నిలిచి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్పౌజ్ ఫోరం అధ్యక్షులు వివేక్, ప్రధాన కార్యదర్శి ఖాదర్, కో కన్వీనర్లు త్రివేణి, సిద్ధయ్య, ఎన్వీసీఎస్ రెడ్డి, ఎస్ఆర్కే రావు, సునిత, సూర్య ఒక ప్రకటన విడుదల చేశారు. 2021 డిసెంబర్లో ఉపాధ్యాయు ల జిల్లా కేటాయింపు ప్రక్రియ పూర్తవగా, అందులోనే భాగమైన దంపతులను ఒకే జిల్లాకు కేటాయించా ల్సిన విషయం ఇప్పటికీ అపరిష్కృతంగానే మిగిలి పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఉపాధ్యాయ దంపతులు భర్త భార్య ఒకే జిల్లాకు చేరుకోవడం కోసం 16 నెలలుగా ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించుకుంటూనే ఉన్నారని పేర్కొన్నారు. గత జనవరిలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలోని 615 మందికి బదిలీలు చేపట్టారని గుర్తు చేశారు. ఇంకా 1,600 మందికి స్పౌజ్ కోటాలో ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. వారంతా 2022 జనవరి నుంచి బదిలీల కోసం నిరీక్షిస్తూనే ఉన్నారని వివరించారు.. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పౌజ్ బదిలీల పట్ల కరుణించాలని కోరారు. మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, భాషా పండితుల స్పౌజ్ బదిలీలు వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.