Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు తలసాని, ఎర్రబెల్లి, మల్లారెడ్డి..
- చేతనైతే నాపై పోటీ చేరు..' రేణుకకు మంత్రి పువ్వాడ సవాల్
- బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ వేడుకలు, ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రులు
నవతెలంగాణ-విలేకరులు
బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయిల్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఆత్మీయ సమ్మేళనాల్లో మంగళవారం మంత్రులు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష పార్టీలపై ఆరోపణలు, వారు చేసిన వ్యాఖ్యలపై సవాళ్లు విసిరారు.
హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపం లో,సికింద్రాబాద్‌లోని మహబూబా కాలేజీలోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో నిర్వహించిన ముషీరా బాద్, సనత్ నగర్ నియోజక వర్గాల బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మంత్రి తలసాని శ్రీని వాస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండ అన్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ అభ్యర్థులు ఓడినా నిరంతరం ప్రజల మద్యనే ఉంటూ వారి సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. గెలిచిన ప్రతిపక్ష కార్పొరేటర్లు ఇప్పటి వరకు ఒక్క రూపాయి అభివృద్ధి పనులైన చేశారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిధుల సభ తూంకుంటలోని జాన్వీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజల మద్య విద్వే షాలు రెచ్చగొట్టి మత రాజకీయాలు చేస్తున్నదని, కానీ చైతన్యవంతమైన తెలంగాణలో బీజేపీ నేతల పప్పులు ఉడకవని అన్నారు. మేడ్చల్ గడ్డ గులాబీ అడ్డ అని, మూడోసారి గెలిచి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని తెలిపారు.
అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం : మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా పాలకుర్తి మండ ల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం లో నిర్వహించిన బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ గ్రామ అధ్యక్షులు బీఆర్ఎస్ జండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడు తూ.. అబివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో పాలకుర్తి ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని, పాలకుర్తి, వల్మిడి, బొమ్మెర గ్రామాలను పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పసునూరి నవీన్, తదితరులు పాల్గొ న్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ఆర్తీ గార్డెన్స్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, మహ బూబాబాద్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌తో ఎంపీ, జిల్లా అధ్యక్షులు మాలోతు కవిత పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి అంటే బీఆర్ఎస్ అని, ప్రభుత్వాలను ప్రజలకు అందుబాటు లో తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని తెలిపారు.
'చేతనైతే నాపై పోటీ చేరు..' రేణుకకు మంత్రి పువ్వాడ సవాల్
ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నం లా మారబట్టే తనను ఎదుర్కోలేక వ్యక్తిగత దూషణకు దిగుతున్నారని మంత్రి పువ్వాడ అజరుకుమార్ అన్నారు. 'అరేరు.. తురేరు.. వాడు.. వీడు' అంటూ సభ్యత మరిచి వ్యవహ రిస్తున్నారన్నారు. తూల నాడటం.. వ్యక్తిగత దూషణ తమకు చేతకాక కాదని, మా నాయన, మా నాయకులు తమకు సభ్యత నేర్పించారని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఖమ్మం నగరంలోని మమత మెడికల్ కళాశాల గ్రౌండ్లో మంగళవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ ప్రతినిధుల సభలో పువ్వాడ మాట్లాడారు. ఎమ్మెల్యేగా తన తొమ్మిదేండ్ల పదవీకాలంలో అభివృద్ధి చేయడం కోసం కష్టపడ్డ కాని.. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర తనకు లేదన్నారు. టిక్కెట్ ఇప్పిస్తాననే పేరుతో గిరిజనుల వద్ద రూ.కోట్లు దోచి.. వారి ప్రాణాలు హరించిన చరిత్ర రేణుకాచౌదరిదని విమర్శించారు. కేంద్రమంత్రి, ఎంపీగా ఖమ్మానికి చేసిన ఓ మంచి పనైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. దమ్ముంటే రేణుకా చౌదరి తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో ఎంపీలు నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.