Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షులు కుమార్ స్వామి
- ఆల్ ఇండియా రైల్వే కాంట్రాక్ట్ పారామెడికల్ స్టాప్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-ఓయూ
దేశవ్యాప్తంగా రైల్వేలో తొలగించి న కాంట్రాక్ట్ పారామెడికల్ స్టాఫ్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్షులు జె.కుమార్ స్వామి డిమాండ్ చేశారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జనరల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. 2005 నుంచి రైల్వేలో డైరెక్టుగా రిక్రూటైన, కోవిడ్ సమ యంలో డైరెక్ట్‌గా రిక్రూటైన కాంట్రాక్ట్ పారా మెడికల్ స్టాఫ్‌ను రైల్వే యాజమాన్యం విధుల్లో నుంచి తీసే యడం దుర్మార్గ మన్నారు. తొలగించిన ఉద్యోగులంద రినీ బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశా రు. రైల్వే పారా మెడికల్ ఉద్యోగులకు నష్టం చేస్తున్న జీఈఎం పోర్టల్‌ను రద్దు చేయాలని, ఖాళీగా ఉన్న పారామెడికల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అలాగే గతంలో పనిచేసిన కాంట్రాక్టు పారా మెడికల్ స్టాఫ్‌కు వెయిటేజీ ఇవ్వాలన్నారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌ను వెంటనే రద్దు చేయాలని, రైల్వే ఆస్తుల ప్రయి వేటీకరణ ఆపాలని, కేంద్ర ప్రభుత్వం, రైల్వే యాజమాన్యం దిగొచ్చి కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించా లని డిమాండ్ చేశారు. లేనియెడల ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ నాయకులు కె.అజయ్ బాబు, ఎం. అజయ్ బాబు షామిలి, కవిత, షామిలి పాల్గొన్నారు.