Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదే రోజు సుదర్శనయాగం
- నేటి నుంచి 28 వరకు కార్యాలయాల తరలింపు
- ఆరో ఫ్లోర్ సీఎం, సీఎస్‌కు కేటాయింపు
- టీఎస్ఎస్పీకి భద్రత బాధ్యతలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సీఎం కేసీఆర్ ఆకాంక్షలు, తెలంగాణ దక్కన్ సంస్కృతీ సంప్రదాయాల మేళవింపుతో నిర్మితమవుతున్న కొత్త సచివాలయం ఈనెల 30న మధ్యాహ్నం 1.32 గంటలకు ప్రారంభం కానుంది. సుదర్శన యాగం పూర్ణాహుతి తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ద్వారం వద్ద రిబ్బన్ కత్తిరించి నూతన సెక్రటేరియట్‌ను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆరో అంతస్తులోకి చేరుకుని సీఎం కార్యాలయంలోని ముఖ్యమంత్రి ఆసనంపై ఆయన కూర్చొంటారు. మధ్యాహ్నం 1.58 గంటల నుంచి 2.04 గంటల మధ్య మంత్రులు, అధికారులు, ఇతర సిబ్బంది తమ కార్యాలయాల్లోకి చేరుకుంటారు. ఆ తర్వాత సచివాలయ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఈ మేరకు కార్యక్రమ షెడ్యూల్‌ను ప్రభుత్వం మంగళవారం సిద్ధం చేసింది.
కొత్త సచివాలయంలోకి ఆయా శాఖల తరలింపు బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఈనెల 27వరకు తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని మంగళవారం ఆయా శాఖల హెచ్వోడీలు ఆదేశాలు జారీచేశారు.
దాదాపు రూ.617 కోట్లతో 26.9 ఎకరాల స్థలంలో సుమారు 10.5 లక్షల అడుగుల విస్తీర్ణంలో నూతన సచివాలయాన్ని నిర్మించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు పార్టీల నేతలను ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే ముందస్తు అధికారిక ఆహ్వానాలు వెళ్లాయి. తరువాత ముఖ్యమంత్రులకు స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసి పిలవనున్నారు. సాగర తీరాన అత్యంత కళాత్మకంగా నిర్మించిన పాలనా సౌధం రాష్ట్రానికే తలమానికం కానుంది. ఆధునిక వసతులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ పరిపాలనా సౌధాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. నూతన సచివాలయంలోకి శాఖల తరలింపుపై సీఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు బుధవారం నుంచి ఈనెల 28 వరకు తరలింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
నూతన సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్లో రెవెన్యూ శాఖ, మొదటి అంతస్తులో హోం శాఖ, , పంచాయతీ రాజ్, రెండో అంతస్తులో ఆర్ధిక శాఖ,మూడో ఫ్లోర్లో వ్యవసాయం, ఎస్సీ అభివృద్ధి, పురపాలక శాఖలు, నాలుగో అంతస్తులో ఇరిగేషన్, న్యాయశాఖలు. ఐదో అంతస్తులో జీఏడీఈ, ఆర్అండ్బీ, ఆరో అంతస్తులో సీఎంవో, సీఎస్ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి.