Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రూ.30.68లక్షల నకిలీ కరెన్సీ, రూ.60 వేల నగదు, 13 మొబైల్ ఫోన్లు స్వాధీనం
- వివరాలను వెల్లడించిన సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీందర్
నవతెలంగాణ-మియాపూర్
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.30.68 లక్షల నకిలీ కరెన్సీ, రూ.60 వేల నగదు,13 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రంగారెడ్డి జిల్లా సైబరాబాద్‌లోని సీపీ కార్యాలయంలో సీపీ స్టీఫెన్ రవీందర్ మీడియాకు వెల్లడించారు. నకిలీ నోట్ల తయారీకి సంబంధించిన విషయంపై పోలీసులకు రెండు నెలల కిందట ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేప ట్టారు. ప్రధానంగా 13 మంది సభ్యులు ఉన్న ఈ ముఠా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళ నాడు కేంద్రాలుగా చేసుకొని దందా నడిపిస్తున్నారు. 500 నోట్లను జిరాక్స్ ప్రింటింగ్ ద్వారా ప్రింట్ తీసి సాయంత్రం వేళలో ఈ నోట్లను మార్చేవారు. నోట్ల మార్పిడికి ప్రధానంగా చిన్న, మధ్యతరగతి షాప్స్, స్ట్రీట్ వేడర్స్ వారిని లక్ష్యంగా చేసుకొని మార్కెట్లోకి తీసుకొచ్చారు. వీరిలో కొంత మంది బల్క్ డబ్బును కూడా లక్ష రూపాయలు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే ఐదు లక్షలు ఫేక్ కరెన్సీని మారుస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిష నరేట్ పరిధిలో సాయంత్రం వేళలో నడుస్తున్న షాప్స్ ప్రధానంగా చేసుకోవడం, అమాయక ప్రజలు వీటిని గుర్తించడంలో లోపాలని లక్ష్యంగా చేసుకొని ఈ కరెన్సీ పెద్ద ఎత్తున చలామణి చేశారు. రాజ స్థాన్‌కు చెందిన కొంటె రాజేష్, త్రిపురకు చెందిన నెలదాస్ ఈ ఇద్దరు మిగతా కొంతమందిని అనుచరులుగా ఏర్పాటు చేసుకొని ఈ నకిలీ కరెన్సీ దందాను సాగించారు. రెండు రోజుల కిందట రాజేష్ ఓ హౌటల్ రూంను ఖాళీ చేస్తూ నకిలీ కరెన్సీ ఇచ్చాడు. ఆ హౌటల్ సూపర్వైజర్కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా మిగతా సభ్యుల వివరాలు చెప్పడంతో వారిని మంగళవారం అరెస్టు చేశారు. ప్రజలంతా నకిలీ నోట్ల విషయంలో జాగ్ర త్తగా ఉండాలని ముఖ్యంగా సాయంత్రం పూట వ్యా పారం చేసే వ్యక్తులు ఇలాంటి మోసాల పట్ల అప్రమ్త తంగా ఉండాలని సీపీ సూచించారు. సమా వేశంలో ఎస్ఓటీ ఏసీపీ శ్యాంబాబు, ఎస్టీఎఫ్, క్రైమ్ డీసీపీ కలమేశ్వర్, మాదాపూర్ డీసీపీ శిల్పావళి, ఆంజనే యులు, రాజగోపాల్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.