Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు ఐక్యవేదిక డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక డిమాండ్ చేసింది. బుధవారం ఈమేరకు ఆ వేదిక రాష్ట్ర అధ్యక్షులు శేర్ నర్సారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా మామిడి, నువ్వు, వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని తెలిపారు. మామిడికాయలు పూర్తిగా నేలరాలిపోవడంతో ఆ రైతులు తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు.