Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపకారవేతనాలను 15 శాతం పెంపు ఈ ఏడాది జనవరి నుంచి వర్తింపజేయాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజూడా) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం టీజూడా అధ్యక్షులు డాక్టర్ కౌశిక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్నీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ రెసిడెంట్లకు ఉపకారవేతనం పెండింగ్ ఉందని తెలిపారు. ఈ సమస్యను 15 నుంచి 20 రోజుల్లో పరిష్కరిస్తామని డీఎంఈ ఇచ్చిన హామీ మేరకు గతంలో సమ్మెను వాయిదా వేసిన విషయాన్ని గుర్తుచేశారు. మే 2 వరకు వేచి చూస్తామనీ, అప్పటికీ సమస్య పరిష్కరించకుంటే మే 3 నుంచి అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను జూనియర్ డాక్టర్లు బహిష్కరించి సమ్మెకు వెళతామని హెచ్చరించారు.