Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఐఎఫ్టీయూ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని మార్క్స్ భవన్లో మేడే పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ఎల్ పద్మ, వి ప్రవీణ్‌లు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సామాజిక భద్రత, పని గంటల తగ్గింపు కోసం మేడే స్ఫూర్తితో కార్మికవర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో కార్మికవర్గం కనీస వేతనాల్లేక, సామాజిక భద్రత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలను కార్మికవర్గం ప్రతిఘటించాలని కోరారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చాలని, కార్పొరేట్ అనుకూల విధానాలు, పెట్టుబడిదారుల అనుకూల విధానాలపై సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎనిమిది గంటల పనివిధానం కోసం పోరాటం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు లింగంగౌడ్, రవీందర్, నల్లన్న, జయ, భారతి, లత, సావిత్రి, పుష్ప వెంకటేశ్‌గౌడ్, భార్గవి తదితరులు పాల్గొన్నారు.