Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేర్వేరు తేదీల్లో నిర్వహించాలి
- ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఈనెల 30వ తేదీన ఒకేరోజు కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పరీక్షలను నిర్వహించడం సరికాదని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ విమర్శించాయి. ఒకే రోజు నాలుగు పరీక్షలు నిర్వహించడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం కలుగుతుందని ఆయా సంఘాల రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, కోట రమేష్, టి నాగరాజు, ఆనగంటి వెంకటేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు పరీక్షలు రాయడానికి అర్హులైన వారికి ఒకే రోజు అన్ని పరీక్షలు నిర్వహిస్తే అన్నింటికీ ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. వేర్వేరు తేదీల్లో పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలు, బోర్డుల మధ్య సమన్యయం లేకుండా అధికారులు ఇష్టారాజ్యంగా పరీక్షల తేదీలను ఖరారు చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ సమస్యతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలిపారు.
భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి తప్పుల్లేకుండా పరీక్షలను పారదర్శకంగా నిర్వహిం చాలని కోరారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకపో వడంతో ఇలాంటి ఇబ్బం దులు ఎదురవుతున్నా యని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 30వ తేదీన నిర్వహిం చతలపెట్టిన పరీక్షలు ఒకేరోజు కాకుండా వేర్వేరు తేదీల్లో నిర్వహించాలని కోరారు.
నిరుద్యోగులకు ఇబ్బం దులు ఎదురవకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.