Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా షకీలారెడ్డి
- పార్టీ కమిటీలోకి మరో నలుగురు
నవతెలంగాణ - హైదరాబాద్
తెలుగుదేశం తెలంగాణ శాఖ రాష్ట్ర కమిటీ విస్తరణలో భాగంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మరో ముగ్గురికి నూతన కార్యవర్గంలో చోటు కల్పించారు. అలాగే తెలుగు మహిళా విభాగానికి కొత్త అధ్యక్షురాలిని నియమించారు. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని(కూకట్పల్లి నియోజకవర్గం), రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుధాకర్ నాయుడు (కొల్లాపూర్ నియోజకవర్గం), రాష్ట్ర కార్యదర్శిగా బి.విఠల్ (బాన్సువాడ నియోజకవర్గం)కు అవకాశం కల్పించారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా షకీలారెడ్డి (ఖైరతాబాద్ నియోజకవర్గం), జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌గా కరాటే రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆ పార్టీ రాష్ట్ర రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది.