Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డులో నూతనంగా నిర్మించిన స్కైవాక్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ స్కైవాక్ వంతెనను ప్రారంభిస్తున్నట్టు హెచ్ఎండీఏ ప్రకటించింది. ఈ స్కైవాక్‌ను రూ. 25 కోట్ల వ్యయంతో నిర్మించారు. దాదాపు 1,000 టన్నులకు పైగా స్టీల్‌ను వినియోగించి, అధునాతనంగా వంతెనను తీర్చిదిద్దారు. స్కైవాక్‌కు ఆరు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీసు సమీపంలోని వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీసు స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ప్రయాణీకుల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్ తరాలను దష్టిలో ఉంచుకుని ఈ స్కైవాక్‌ను ఏర్పాటు చేశారు. మున్సిపల్, పట్టణాభివద్ధి శాఖ మంత్రి కె. తారకరామారావు సూచనల మేరకు ఉప్పల్ స్కైవాక్ వంతెనను ఏర్పాటు చేసినట్టు తెలిపింది.