Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి పొందుతున్న సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావును సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శాసన సభ్యులుగా, సీపీఐ జాతీయ నాయకులుగా ప్రజలకు ఆయన చేసిన సేవలు గుర్తుచేశారు. రాష్ట్ర, జిల్లా రాజకీయ పరిస్థితులపై తమ్మినేనిని పువ్వాడ అడిగి తెలుసుకున్నారు. తిరిగి పూర్తి ఆరోగ్యంతో రాజకీయాలను కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. పువ్వాడ ఆరోగ్యం కుదుటపడడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ప్రస్తుత రాష్ట్ర, జిల్లా రాజకీయ పరిణామాలు, వామపక్షాల ఐక్యత, రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించారు. ప్రస్తుత సమయంలో వామపక్షాల ఐక్యత ఎంతో అవసరం అని పువ్వాడ ఆకాంక్షించారు. వారి వెంట పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఉన్నారు.