Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడగండ్ల వర్షంతో పంట నష్టం
- క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
అకాల.. వడగండ్ల వర్షం రైతులకు తీవ్ర వేధనను మిగిల్చాయి.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడ్లు, మామిడి రాలిపోయాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం కూడా వరదలో కొట్టుకుపోయింది. ఈదురు గాలులకు పట్టాలు లేచిపోయాయి. ఆరుగాలం కష్టం చేసి పంట పండిస్తే నోటి కాడికి వచ్చే సమయంలో నేలపాలైంది. దెబ్బతిన్న పంటలను బుధవారం అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. రైతులకు ధైర్యం చెప్పారు. కాగా, హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి ఇటుకలు పడి చిన్నారి మృతిచెందింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పంటలకు నష్టం వాటిల్లింది. మంగళవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పంటలు నేలవాలాయి. ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది మండలాల్లో మొక్కజొన్న, జొన్న పంటలకు నష్టం వాటిల్లగా.. కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లాలోనూ సిర్పూర్, కాగజ్‌నగర్ తదితర అన్ని మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. వరి పైరు వంగిపోయి వడ్లు రాలిపోయాయి. నిర్మల్ జిల్లాలోనూ మొక్కజొన్న, జొన్న, వరి పంటలకు నష్టం వాటిల్లింది. కడెం మండలంలో కలెక్టర్ వరుణ్‌రెడ్డి పంటలను పరిశీలించారు. మంచిర్యాల జిల్లాలోనూ ఇదే స్థాయిలో పంట నష్టం జరిగింది. ఆయా జిల్లాల అధికార యంత్రాంగం నష్టపోయిన పంటలను పరిశీలించి అంచనా వేస్తోంది. నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం రైతన్నకు తీవ్ర నష్టం చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 41,711 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇటీవల కాలంలో ఇంత భారీ మొత్తంలో పంట నష్టం జరగడం ఇదే మొదటిసారి. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 31 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. ఇందులో 31,128 ఎకరాల్లో వరి పంట ఉంది. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతన్న కన్నీరుమున్నీరవుతున్నాడు. నిజామాబాద్ జిల్లాలో 8 వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ధాన్యం గింజలన్నీ నేలరాలాయి. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే రైతన్నకు కొంత ఊరట లభించనుంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల కలెక్టర్ జితేశ్ వి పాటిల్, వ్యవసాయాధికారులు పంటలను పరిశీలించారు. బాన్సువాడలో స్పీకర్ పోచారం, ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నరసన్నపల్లి, పొందుర్తిలో పరిశీలించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. సిద్దిపేట జిల్లాలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంట పొలాలను బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. మంత్రి రైతులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. పంట నష్టపోయిన రైతులను కాపాడుకుంటామని భరోసి కల్పించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. మద్దూరు దూల్మిట్ట మండలంలోని లద్నూరు రేబర్తి వల్లంపట్ల బైరాన్ పల్లి బెక్కల్ తోర్నాల దూల్మిట్ట లింగాపూర్ గ్రామాలలో ఎంపీపీ బద్దిపడగ కష్ణారెడ్డి తో కలిసి పంట నష్టాన్ని పరిశీలించారు. మద్దూరు మండలంలో ఇటీవల కురిసిన అకాల వడగండ్ల వర్షానికి పంట నష్టపోవడంతో సీపీఎం మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి ఆధ్వర్యంలో బుధవారం పొలాలను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు పర్యటించి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులను ఆదుకోవాలని కోరారు.
సంగారెడ్డి జిల్లాలో 15 మండలాల్లో వరి, జొన్న, మొక్కజొన్న, టమాటా, ఉల్లి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 258 గ్రామాల్లో 4047.28 ఎకరాల్లో 33 శాతం పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు గుర్తించారు. 3093 మంది రైతులకు రూ.4.04 కోట్ల పంట నష్టం మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు జరి గిన పంట నష్టాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఐదు రోజులుగా సిద్దిపేట జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. వరి, జొన్న, మొక్కజొన్న పైర్లు నేలవాలాయి. పెద్దపెద్ద వడగండ్లు పడటంతో ధాన్యం నేలరాలింది. మెదక్‌లో భారీ వర్షం కురి సింది. సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఈనెల మొదటి వారం నుంచే వర్షాలు పడుతున్నాయి. వరి, జొన్న, మొక్క జొన్న, టమాటా, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తిం చారు. ముందుస్తుగా నష్టాన్ని అధికారులు అంచనా వేసి నష్టపరిహారం కోసం పంపారు. రోజూ వర్షాలు కురుస్తుం డటంతో ధాన్యం రాసులు తడుస్తున్నాయి. వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోతుందని రైతులు ఆందోళన చెందుతు న్నారు. సరిపడా తార్పాలిన్లు లేకపోవడంతో ధాన్యం రాసులు తడుస్తున్నాయి. గతంలో సీఎం ప్రకటిం చిన ఎకరా నికి రూ.10 వేల నష్టపరిహారం సంగారెడ్డి జిల్లాలోని 15 మండలాల రైతులకు మంజూరైందని కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు.