Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీజు నిబంధనలు పాటించని, బకాయిలు చెల్లించని
- సంస్థలపై చర్యలు తీసుకుంటాం
- రూ.100కోట్ల టర్నోవర్ అభినందనీయం
- సమీక్షాసమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రపంచ బెస్ట్ పర్యాటక గ్రామంగా యాదాద్రి-భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామం ఎంపికైందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హైదరాబాద్ బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలో బుధవారం ఉద్యోగులతో టూరిజం కార్పోరేషన్ చైర్మెన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎండీ మనోహర్‌తో కలిసి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక రంగం రూ.100 కోట్ల టర్నోవర్‌ను సాధించిన సందర్బంగా కార్పొరేషన్ ఎండీ మనోహర్, ఉద్యోగులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అభివద్ధి పేరుతో లీజులు తీసుకుని నిబంధనలు పాటించని, బకాయిలు చెల్లించని సంస్థలపై తెలంగాణ వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నామని తెలిపారు. టూరిజం శాఖకు రావాల్సిన రూ.60కోట్లకుపైగా బకాయిలను వసూలు చేశామని అన్నారు. వేల కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకుని పర్యాటకంగా అభివద్ధి చేయడానికి కషి చేస్తున్నామని చెప్పారు. సంస్ధ అభివద్ధికి ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సూచనల మేరకు పర్యాటక రంగ అభివద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని చెప్పారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న పర్యాటక కేంద్రాలను వినియోగంలోకి తేవడానికి అధికారులు కషి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో యునెస్కో గుర్తింపు పొందే అవకాశం ఉన్న ప్రదేశాలు చాలా ఉన్నాయని, వాటికి గుర్తింపు కోసం కషి చేస్తున్నామన్నారని వివరించారు. 20ఏండ్లుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు లభించి ఉంటే ఎంతో అభివద్ధి జరిగేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు టూరిజం ప్రమోషన్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యాటక ప్రదేశాలను పరిరక్షణకు కషి చేస్తున్నామని, పర్యాటక కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కషి చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే బెస్ట్ టూరిజం ప్రాంతంగా తెలంగాణను అభివద్ది చేస్తున్నామని చెప్పారు.