Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్వెస్లీ
- 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రం ఆవిష్కరణ
నవతెలంగాణ-అంబర్పేట
దేశ సామాజిక విప్లవానికి సారథులుగా నిలిచిన మహాత్మ జ్యోతిబాఫూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా ఏప్రిల్ 29న హైదరాబాద్లో రాష్ట్రస్థాయి ఫూలే అంబేద్కర్ జనజాతర నిర్వహిస్తున్నట్టు కేేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్వెస్లీ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని 125అంబేద్కర్ విగ్రహం వద్ద జనజాతర కరపత్రాలను టీపీఎస్కే రాష్ట్ర కార్యదర్శి జి.రాములు ఆవిష్కరించారు. జాన్వెస్లీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగాన్ని రద్దు చేసే విధంగా ఉన్నాయన్నారు. మనువాద ఎజెండాతో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పరిపాలన చేస్తున్న బీజేపీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ పేదలపై పెనుభారాలు మోపుతున్నదన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం రాజకీయాలకతీతంగా ఐక్య ఉద్యమం చేపడుతామ న్నారు. రాములు మాట్లాడుతూ.. జన జాతరలో ప్రజలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్శ్రీరామ్నాయక్, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎంవీ రమణ, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధర్మానాయక్, కేవీపీఎస్ హైదరాబాద్ మేడ్చల్ జిల్లాల అధ్యక్ష, కార్య దర్శులు ఎం.దశరధ్, బి.సుబ్బారావు, ఎం.కృపా సాగర్, ఎన్.బాలపీరు, టీఆర్వీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడిరాజుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.